సాధారణంగా కొందరూ వ్యక్తులు చనిపోయిన తరువాత కూడా వారి రిలేటివ్స్ అబద్దాలు చెప్పి పింఛన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ పింఛన్లు ఇచ్చే బీపీఎం పింఛన్ తీసుకొని అవినీతికి పాల్పడ్డాడు. దాదాపు మూడు నెలల నుంచి అధికారుల కళ్లు గప్పి మరణించిన ఓ వ్యక్తికి సంబంధించిన ఆసరా పింఛన్ డబ్బులు కాజేసాడు. కొమురం భీమ్ జిల్లా వాంకిడి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వాంకిడి మండల కేంద్రానికి చెందిన షేక్ మహబూబ్ అనే వ్యక్తి ఆగస్టు నెలలో మరణించాడు. తన తల్లికి పెన్షన్ మంజూరు కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేశారు. షేక్ మహబూబ్ అనే వ్యక్తి పై పింఛన్ డ్రా చేసినట్టు అధికారులు తెలపడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మొత్తం రూ.6048 పింఛన్ డ్రా చేసినట్టు కుటుంబ సభ్యులకు అధికారులకు రికార్డులు చూపించారు. చనిపోయిన వ్యక్తి ఎలా పింఛన్ తీసుకుంటాడని ప్రశ్నించారు. మరణించిన వ్యక్తి పింఛన్ కూడా వదలరా..? ఇదెక్కడి కక్కుర్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టల్ బీపీఎం పై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.