ఇవాళ కుమురం భీం వర్ధంతి అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. కుమురం భీంకు నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు. ఇక కేటీఆర్ కూడా పోస్ట్ పెట్టాడు. ఆదివాసీ యోధుడు..అరణ్య సూర్యుడు ! పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ… దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడు ! గోండు బెబ్బులి ..కుమురం భీం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
ఉద్యమ బాటలో..ఉజ్వల ప్రగతి దారిలో జల్ ..జంగల్ ..జమీన్ నినాదమే స్ఫూర్తిగా కొమురం భీం ఆశయాల అడుగు జాడల్లో పయనించామని తెలిపారు. కొండల్లో..కోనల్లో వున్న ప్రతి గూడేనికి, తండాకు స్వచ్ఛమైన మంచినీళ్ల సరఫరాతో విష జ్వరాల చావుల నుంచి విముక్తి అంటూ వ్యాఖ్యానించారు. 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై హక్కులు కల్పిస్తూ.. అడవి బిడ్డలకు పట్టాభిషేకమన్నారు. మావనాటే మావరాజ్ .. స్వరాష్ట్రంలో నెరవేరిన మా గూడెంలో మా తండాలో మా రాజ్యం ఆకాంక్ష.. 2,471 గిరిజన పంచాయతీల్లో ఎగిరిన స్వయం పాలనా జెండా అని తెలిపారు.