రేపో.. మాపో జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం – కోమటిరెడ్డి

-

రేపో.. మాపో జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జగదీష్ రెడ్డి…చావు తప్పి కన్ను లొట్ట పోయి గెలిచాడని చురకలు అంటించారు. ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు….ముగ్గురిని హత్య చేసిన కేసులో నిందితుడు.. హంతకుడంటూ ఫైర్‌ అయ్యారు.

komatireddy on jagadeesh reddy

జగదీశ్ రెడ్డి గురించి మాట్లాడటం వెస్ట్…అతను 80 ఎకరాల ఫార్మ్ హౌస్ ఎలా కట్టాడని నిలదీశారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం.. చుట్టూ జగదీశ్ రెడ్డికి 150 ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపణలు చేశారు. 200 యూనిట్ల కరెంట్..100 రోజుల్లో ఇస్తామని…హామీ నిలబెట్టుకుంటామని ప్రకటించారు.అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఇద్దాం అనుకున్నాం కానీ 100 రోజుల్లో ఇస్తామని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version