కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా కాంగ్రెసు పార్టీ కి రాజీనామా చేశారు.
ఈ మేరకు కాసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. రాజీనామా పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని.. కొన్ని రోజులు సమయం తీసుకుని నిర్ణయం తీసుకుందామని అనుకున్నానని పేర్కొన్నారు.
ఇప్పుడున్న ప్రభుత్వం ఉప ఎన్నికలు వస్తె అక్కడే నిధులు ఇస్తున్నారని.. అందుకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. నా మీద ఆశతో నన్ను మునుగోడు ప్రజలు గెలిపించారని..కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవడంతో నేను ఏం చేయలేకపోయానని తెలిపారు. ఇంకా 18 నెల్ల సమయం ఉంది..రాజీనామా చేస్తే నిధులు… వస్తాయని..కొందరు అయిన బాగుపడతారని వెల్లడించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.