ఎమ్మెల్సీ కవితపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు..!

-

తెలంగాణ ఎమ్మెల్సీ కవిత వల్లనే కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిందని బీఆర్ఎస్ చేసిన కామెంట్స్ పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేడు. మహిళా బిల్లు వస్తున్నప్పుడు కవిత ఎంపీ కాదు.. అయినప్పటికీ ఆ ఘనత మీదే అన్నట్టు చెప్పుకోవాలని చూడటం హాస్యస్పదమన్నారు కోమటిరెడ్డి. కవిత ఓడిపోయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ కవిత గెలిచి ఉంటే.. తెలంగాణ బిల్లును తానే తీసుకొచ్చినట్టు డబ్బు కొట్టుకొని జనం చెవుల్లో పూలు పెట్టేది అని ట్వీట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు పై రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు మహిళా బిల్లును ఎమ్మెల్సీ కవిత కోసమే ప్రధాని నరేంద్ర మోడీ వెళుతున్నట్టు మాట్లాడుతుందని ఎమ్మెల్సీ కవితపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఫైర్ అయ్యారు. కేసులను తప్పుదోవ పట్టించేందుకు నాటకాలు ఆడకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాన్న కేసీఆర్ సెంబ్లీ సీట్లు మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చారు అని ప్రశ్నించారు. మహిళా అయినా తనపై అడ్డగోలుగా మీ నాన్న మా ట్లాడారని మండిపడ్డారు డీకే అరుణ.

Read more RELATED
Recommended to you

Latest news