లిక్కర్‌ స్కాంలో కవిత అరెస్ట్‌ కావడం ఖాయం – కోమటిరెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కూతురు ఎమ్మెల్సీ కవిత పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మాజీ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. లిక్కర్‌ స్కాంలో కవిత అరెస్ట్‌ కావడం ఖాయం అంటూ బాంబ్‌ పేల్చారు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. అవినీతి సొమ్ముతో కవిత ఢిల్లీలో 600 మద్యం షాపులు పెట్టిందని ఆరోపణలు చేశారు.

లిక్కర్ స్కాంలో కవిత అరెస్టవ్వడం ఖాయమన్నారు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. TRSపై ఉన్న వ్యతిరేకతను మళ్లించడానికే BRSగా మార్చారని నిప్పులు చెరిగారు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.ఎదుర్కొనే దమ్ములేక కేటీఆర్, రేవంత్‌ నాపై అవినీతి ఆరోపణలు చేశారు.. నాపై ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశానన్నారు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. కాగా, గతంలోనూ బీజేపీ నేతలు అయిన ధర్మపూరి అరవింద్‌, వీ 6 వివేక్‌ కూడా లిక్కర్‌ స్కాంలో కవిత అరెస్ట్‌ కావడం ఖాయం అంటూ బాంబ్‌ పేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version