కేసీఆర్ ప్లాన్ రివర్స్..జంపింగులు రెడీ!

-

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు..ఎల్లకాలం ఒకే పార్టీ హవా నడవడం కూడా కష్టమే. తెలంగాణలో గత పదేళ్ళ నుంచి బి‌ఆర్‌ఎస్ హవా నడుస్తోంది. 2014,ల 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఈ రెండుసార్లు అధికారంలోకి వచ్చాక బి‌ఆర్‌ఎస్ లో ఎంతమంది ఇతర పార్టీ నేతలు చేరారో చెప్పాల్సిన పని లేదు. అసలు బి‌ఆర్‌ఎస్ లో ముందు నుంచి ఉన్నవాళ్ళు సగం మంది కూడా ఉండరు. టి‌డిపి-కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వారే సగం పైనే ఉంటారు.

 

అంటే ఆ బి‌ఆర్‌ఎస్ పార్టీలో చాలామంది వలస నేతలే. అయితే బి‌ఆర్‌ఎస్ హవా నడుస్తుండటంతోనే ఆ పార్టీలోకి వలసలు నడిచాయి. కానీ ఇప్పుడు నిదానంగా సీన్ మారుతుంది.. ఓ వైపు బి‌జే‌పి బలపడింది..మరోవైపు కాంగ్రెస్ పికప్ అవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ నేతలే..జంప్ అయ్యేలా ఉన్నారు. ఇప్పటికే పార్టీలో ఓవర్ లోడ్ అయింది. దీంతో ఎవరికి పదవులు వస్తాయో..ఎవరికి సీట్లు వస్తాయో తెలియని పరిస్తితి. ఇక బి‌ఆర్‌ఎస్ లో ఖాళీగా ఉన్న వారు మాత్రం జంప్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు.

ఆఖరికి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు లేదని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారు బి‌జే‌పి లేదా కాంగ్రెస్ లోకి వెళ్లాలని చూస్తున్నారని తెలిసింది.ల ఈ తరుణంలోనే సిట్టింగులు అందరికీ సీట్లు అని కే‌సి‌ఆర్ ప్రకటించారు. దీంతో కాస్త వలసల ఆలోచన ఆగింది. వలసలని ఆపడానికే కే‌సి‌ఆర్ ఆ ప్లాన్ వేశారని తెలిసింది. కానీ ఎన్నికల సమయానికి కొందరు సిట్టింగులని పక్కన పెట్టడం ఖాయమని తెలుస్తోంది.

ఇక అలా సీటు దక్కనివారు మాత్రం పార్టీ జంపింగుకు ఇప్పటినుంచే రెడీ అవుతున్నారట. ఇప్పటినుంచే బి‌జే‌పి, కాంగ్రెస్ లతో టచ్ లో ఉంటున్నారని తెలిసింది. కే‌సి‌ఆర్ సీటు లేదని చెప్పిన మరుక్షణం వారు జంప్ అయ్యేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version