కాంగ్రెస్‌ లో చేరడంపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

-

కాంగ్రెస్‌ లో చేరడంపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్నాని వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని…మునుగోడు ఉప ఎన్నికల తర్వాత నేడు ఎక్కడ ఈ మాటలు అన లేదని వివరించారు. కథనాలు సృష్టించి వార్తలు రాస్తున్నారు…రాజకీయంగా ఎదుర్కొనలేక నా పై ఉపఎన్నికలలో దుష్ప్రచారం చేసి నేను ఓటమి చెందేలా చేసారని వెల్లడించారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.

రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాడు…కర్నాటక ఫలితాల తర్వాత కొంత మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు నా మిత్రులు నన్ను తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్న మాట వాస్తవం అని వివరించారు. కర్నాటక లో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణ లో కాంగ్రెస్ లో గెలవాలని లేదు… కేంద్రంలో అధికారంలో లేకుండా , బలమైన నాయకత్వం లేకుండా తెలంగాణ లో కేసీఆర్ ను ఓడించడం సాధ్యం కాదన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్, జానా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ల ఆధ్వర్యంలో నాలుగు గ్రూపులు తయారయ్యాయి.. ఎన్నికలు జరగలేదు, ఫలితాలు రాలేదు అప్పుడే నాలుగు గ్రూపులు తమ నేత ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలుపెట్టాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version