ఏపీ రేషన్ కార్డు దారులకు అలర్ట్.. రేషన్ కార్డుల జారీ పై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు.

కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ తో రాష్ట్రంలో ఏ షాపులోనైనా రేషన్ తీసుకోవచ్చు అని ప్రకటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కీలక మార్పులు చేస్తోంది. ఇకపై కార్డులోని సభ్యులను తొలగించడానికి కొత్త మార్గదర్శకాలు రిలీజ్ అయ్యాయి. ఉద్యోగం, చదువు, వివాహం లాంటి కారణాలతో వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని కార్డ్ నుంచి తొలగించవచ్చు.