కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి హాట్‌ కామెంట్స్‌..అదే జరిగితే జైలుకే !

-

కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సీఎంపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని.. దమ్ముంటే కేటీఆర్ చేసిన ఆరోపణలు నిరూపించాలని కోరారు. ప్రభాకర్ రావు ను అమెరికా నుండి రావద్దని అమెరికాకు వెళ్లి హరీష్ రావు, కేటీఆర్ చెప్పారన్నారు. ప్రభాకర్ రావు వస్తే వీళ్ళ దోపిడీ బయటపడుతుంది.. జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

komatireddy venkat reddy fire ktr

దోచుకున్న వాడికి అంతా దోపిడీ కనిపిస్తుందని తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి… లేకుంటే సంస్థల ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవదని హెచ్చరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఆ, కేటీఆర్ ఆ, హరీష్ రావో చెప్పాలని కోరారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, కలసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు … రెండు లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news