మాణిక్యం ఠాగూర్‌ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

నిన్న నల్గొండ జిల్లాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ చార్జీ.. మాణిక్యం ఠాగూర్‌ తో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం మాణిక్యం ఠాగూర్‌ మీడియాతో మాట్లాడారు. నిన్న కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను ఇప్పుడు మాట్లానని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి సమస్యలు లేవని ఆయన వెల్లడించారు. ఇంత చేస్తున్నా.. సీఎం కేసీఆర్‌ పై ఎలాంటి ఈడీ, సీబీఐ, దాడులు జరుగడం లేదని ప్రశ్నించారు మాణిక్యం ఠాగూర్‌. బీహార్‌, యూపీకి ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీని ఎవరు పంపించారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అస్సలు మోసం చేయలేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకిక వాదాన్ని నాశనం చేయడానికి.. ఇన్ని రోజులు ఎవరూ డబ్బులు ఇచ్చారని నిలదీశారు మాణిక్యం ఠాగూర్‌. తెలంగాన రాష్ట్రంలో.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు మాణిక్యం ఠాగూర్‌.