సీఎం అభ్యర్థిపై కలిసి నిర్ణయం తీసుకుంటాం: కోమటిరెడ్డి

-

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. మరోవైపు ఈ విజయంపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు.  కాంగ్రెస్ విజయదుందుభిపై ఆ పార్టీ  నేత స్పందించారు. తెలంగాణ విజయాన్ని సోనియా గాంధీకి బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాను సీఎం రేసులో ఉన్నానా? లేదా? అన్నది అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు కాబట్టే రేవంత్‌రెడ్డిని డీజీపీ కలిశారని అన్నారు. సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

మరోవైపు ఆ పార్టీ ఎంపీ, హుజూర్‌నగర్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. అవినీతి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. నియంతృత్వాన్ని తెలంగాణ ప్రజలు హర్షించరని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో ఆయన గెలుపొందారు.

Read more RELATED
Recommended to you

Latest news