మరో 10 ఏళ్ళు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారు – కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

-

మరో 10 ఏళ్ళు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నల్లగొండ జిల్లా ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డి తో కలిసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు…అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని తెలిపారు.

ఏకనాథ్ షిండే ను సృష్టించిందే బిజెపి పార్టీ….హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి లు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండేలు లేరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. పనికిరాని చిట్ చాట్ లు బంద్ చేయాలని.. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే నేను దేనికైనా సిద్ధమని సవాల్‌ చేశారు. మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దు…బండి సంజయ్ ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డి కి తెలుసా అని నిలదీశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version