సాయిచంద్ ను తెలంగాణ సమాజం మరువదన్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం విచారకరమన్నారు. చిన్న వయసులోనే సాయిచంద్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసిందని… తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నేను నల్గొండలో నిరాహార దీక్ష చేసినన్ని రోజులు పాటలు పాడుతూ నా వెంటే ఉన్నారు సాయిచంద్ అని… తెలంగాణరాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది.. ఎప్పటికీ జనం గుండెల్లో ఉంటుందని వివరించారు. తన ఆట పాటలతో ప్రజలలో నాడు ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు సాయిచంద్…సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు.. సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన స్వరం ఆయువుపట్టుగా నిలిచిందన్నారు.