బండితోనే ఎన్నికల బరిలోకి..కమలానికి కలిసొస్తుందా?

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మార్పుపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్‌ని మార్చి..కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా పెడతారని ప్రచారం సాగుతుంది. ఇటీవల బండి తో కొందరు నేతలకు పొసగడం లేదని కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..వీరికి బండితో పడటం లేదు. అలాగే బండి అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన ఈటల, కోమటిరెడ్డి…బండిని అధ్యక్ష పదవి నుంచి మార్చాలని బి‌జే‌పి అధిష్టానానికి చెప్పారని కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి అధ్యక్షుడుగా, ఈటల ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ అవుతారని ప్రచారం జరిగింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వరని, అందుకే బండిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని మరొక కథనం వచ్చింది.

అయితే ఈ కథనాల్లో నిజం లేదని తేలిపోయింది. తాజాగా రాష్ట్ర బి‌జే‌పి వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ బండి సంజయ్‌ని మార్చే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అమిత్ షా, జే‌పి నడ్డా…బండికి ఫోన్ చేసి..అధ్యక్ష మార్పుని పట్టించుకోవద్దని, బండినే అధ్యక్షుడుగా కొనసాగుతారని చెప్పారట. దీంతో బండి సంజయ్ అధ్యక్షుడుగా కొనసాగనున్నారు.

ఇప్పటికిప్పుడు అధ్యక్షుడుని మర్చితే మళ్ళీ పార్టీలో సర్దుబాట్లు జరగాలి. దాని వల్ల మళ్ళీ ఇబ్బందులే..అందుకే బండి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లడానికి బి‌జే‌పి రెడీ అవుతుంది. మరో ఐదారు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి బండిని మార్చే ప్రసక్తి లేదని తెలుస్తుంది. ఇక బండి ఆధ్వర్యంలో ఎన్నికల్లో బి‌జే‌పి ఏ మేర సత్తా చాటింది..ఆ ఫలితాలు బట్టి నెక్స్ట్ అధ్యక్షుడు మార్పుపై ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news