మంత్రులు డబ్బులు తీసుకోవడం పై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. నేను మాట్లాడింది గత ప్రభుత్వ హయాంలోని మంత్రుల గురించి అంటూ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. గతంలో ఏ పని చేయడానికైనా మంత్రులు డబ్బులు తీసుకునే వారని నేను మాట్లాడాను… నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు.

ఈ అంశంపై ఈరోజే మరింత క్లారిటీ ఇస్తాను అన్నారు మంత్రి కొండా సురేఖ. ఇక అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని బాంబు పేల్చారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. నా దగ్గరకు కూడా ఓ కంపెనీ వాళ్లు ఫైల్ క్లియరెన్స్ కోసం వచ్చారన్నారు.