ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను యూపీఐ ద్వారా పొందవచ్చా..?

-

కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాల సంక్షేమం కోసం కొత్త చర్యలను తీసుకురావడం ప్రారంభించింది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ద్వారా లాభాలను అందించేందుకు చర్యలు తీసుకువచ్చింది. మోడీ ప్రభుత్వంలో తాజాగా ఈపీఎఫ్ఓ 3.0 పేరిట కొన్ని మార్పులు తీసుకురావడం వల్ల పిఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవడం మరింత సులభమైంది. ఇంతకు ముందు పిఎఫ్ డబ్బులను ఆన్లైన్ ద్వారా అందించినప్పటికీ వాటిని తీసుకోవడానికి వారం రోజులపాటు ఇబ్బందులుపడాల్సి వచ్చేది.

అయితే ఇప్పుడు ఉద్యోగస్తులు వారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఖాతా నుండి తీసుకోవడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇక పై ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఏటీఎం ద్వారా లేదా యూపీఐ ద్వారా కూడా పొందవచ్చు. అంతేకాక ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ప్రావిడెంట్ ఫండ్ ను విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. వివాహ ఖర్చుల కోసం పిఎఫ్ లోని మీ కాంట్రిబ్యూషన్ తో పాటు వడ్డీతో సహా 50% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి 90% వరకు ప్రావిడెంట్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు.

పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందుగా ఈ మొత్తాన్ని తీసుకునే వీలు కూడా ఉంది. వైద్య చికిత్స కోసం కూడా ప్రావిడెంట్ ఫండ్‌ను ఉపయోగించుకోవచ్చు. నిరుద్యోగం ఎదురైనప్పుడు, ఉద్యోగులకు జీతం రాని సమయంలో ఈ నిధిని విత్ డ్రా చేసుకోవచ్చు. అదే విధంగా పని చేస్తున్న కంపెనీ నుండి తొలగించినప్పుడు మరియు కోర్టు కేసులో పోరాడే పరిస్థితులలో ప్రావిడెంట్ ఫండ్ లో 50% వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ విత్ డ్రా ప్రక్రియను మరింత సులభం చెయ్యడానికి ప్రభుత్వం యూపీఐ మరియు ఏటీఎం ద్వారా డబ్బులను పొందే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news