చేవెళ్లలో బీజేపీ భారీ మెజార్టీకి కారణం వెల్లడించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మోడీ వేవ్ ఉండటం వల్లే బీజేపీకి భారీ మెజారిటీ వచ్చిందని ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోడీ వస్తే.. రిజర్వేషన్లు తొలగిస్తుందని దుష్ప్రచారం చేసినా ప్రజలకు బీజేపీని నమ్మి ఓట్లు వేశారని తెలిపారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయని తెలిపారు.

వికారాబాద్, తాండూరు, పరిగిలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగిందని, గతంలో మూడు, నాలుగు వేల ఓట్లు కమలం పార్టీకి పడితే ఈ సారి 20 వేలు, 30 వేల ఓట్లు పడ్డాయని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ మోర్చా కమిటీలు తన తరఫున విస్తృతంగా పని చేశారని ఆ దెబ్బకు ప్రతిపక్షాల గల్లంతయ్యాయయని అన్నారు. శేరిలింగంపల్లిలో ఊహించని రీతిలో బీజేపీకి ఓట్లు పోలయ్యాయని అన్నారు. మెదక్లో కాంగ్రెస్, బీజేపీల లిక్కర్, డబ్బు పనిచేయలేదని, బీజేపీ అభ్యర్థి రఘునందన్ వైపే జనం మొగ్గు చూపారని పేర్కొన్నారు. ఈ సారి ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగాయని కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version