అమెరికా వెళ్లి వచ్చే సరికి..రేవంత్ సీటే పోయేలా ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ మీరు అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం రద్దు అయ్యేలా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి బెదిరిస్తే భయపడే వాళ్ళు లేరు.. సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని…హుజురాబాద్ ప్రజలకు రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం స్పందించలేదు.. నా జీతం నుంచి 4 లక్షలు వాళ్లకు ఇచ్చానన్నారు. హుజురాబాద్లో పొన్నం ప్రభాకర్ మిత్రుడు ప్రెస్ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.