సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నువ్వు కొట్టినవ్ మేము తీసుకున్నాం.. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా అయితవ్ అంటూ హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు బిగ్ షాక్ ఇచ్చింది బీఆర్‌ఎస్ పార్టీ. దానం నాగేందర్‌పై అనర్హత వేటువేయాలని బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వెయ్యాలని పిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనిపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ మాట్లాడుతూ…. బీఆర్ఎస్ పార్టీ బీ ఫార్మ్ మీద గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్ 3 నెలల్లో ఎమ్మెల్యే పదవి నుండి డిస్ క్వాలిఫై కాబోతున్నారన్నారు. కచ్చితంగా దానం నాగేందర్ డిస్ క్వాలిఫై అవుతారని వివరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.