కాంగ్రెస్‌లోకి మీరు పోతేపోండి మేం బీఆర్‌ఎస్‌లోనే ఉంటాం – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

-

కాంగ్రెస్‌ పార్టీలోకి మీరు పోతేపోండి మేం బీఆర్‌ఎస్‌లోనే ఉంటామని తేల్చి చెప్పారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపి వివేకానంద రెడ్డి. ఇవాళ తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపి వివేకానంద రెడ్డి మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి పైనే నేను పార్టీ మారాడు అని కోర్టులో పిటిషన్ వేసానని… పార్టీ మారిన ఎంఎల్ఏ పైన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు.

kp vivekananda and mahipaul reddy

పార్టీ మారిన ఎంఎల్ఏ ల స్థానాల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయని… నేను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపి వివేకానంద రెడ్డి. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కంటే నా నియోజకవర్గం లో అత్యధిక మెజారిటీ వచ్చిందని.. నాకు ఓటు వేసిన ప్రజలను మోసం చేసి పార్టీ మారే ఉద్దేశ్యం లేదని వివరించారు. కేసిఆర్ నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపి వివేకానంద రెడ్డి. కాగా, BRS నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటీషన్‌ విచారణను గురువారానికి వాయిదా వేసింది ఏపీ హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version