శ్రీశైలం, సాగర్‌ నుంచి తాగునీటి అవసరాలకు మాత్రమే నీరు : KRMB క్లారిటీ

-

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎగువ నుంచి ప్రవాహాలు లేనందున రెండు రాష్ట్రాలు నీటి వినియోగం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని త్రిసభ్య కమిటీ కన్వీనర్‌ డీఎం రాయిపురే సూచించారు. సోమవారం రోజున హైదరాబాద్‌లోని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ సమావేశానికి హాజరుకాలేదు.

వచ్చే నెల(సెప్టెంబరు) వరకు తాగు, సాగు నీటికి శ్రీశైలం, సాగర్‌ల నుంచి 30.09 టీఎంసీలు అవసరమని ఇండెంట్‌లో కోరిన ఏపీ.. సమావేశంలో మాత్రం తాగునీటికే సెప్టెంబరు నాటికి 25 టీఎంసీలు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాలకు కేటాయింపులు చేయాలని బోర్డుకు పంపిన ఇండెంట్‌ లేఖలో తెలంగాణ కోరింది. జలాశయాల్లో సరిపడా నిల్వలు లేవని.. ప్రవాహాలు వచ్చే అవకాశాలు కూడా లేనందున ఈ మేరకు తాగునీటికి కేటాయింపులు చేయాలని కోరినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version