కూతుర్ల పెళ్లి విషయంలో శోభన్ బాబు నిర్ణయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.!

-

ఆంధ్ర సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్ని వందల చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శోభన్ బాబు ను అందరూ డబ్బు మనిషి అని పిలిచేవారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంత డబ్బు సంపాదించుకున్నా సరే ఆయన సినీ పరిశ్రమకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, పైగా పారితోషకం విషయంలో నిర్మాతలతో నిక్కచ్చితంగా వ్యవహరించేవాడనే విమర్శలు కూడా ఉన్నాయి.

అయితే శోభన్ బాబు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. ప్రతి ఒక్కరికి సహాయం చేయకపోయినా సరే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు.. అందుకే శోభన్ బాబు అంటే ఇండస్ట్రీలో చాలామందికి గౌరవం ఉండేది. వాస్తవానికి శోభన్ బాబు అందరూ అనుకుంటున్నట్టు డబ్బు మనిషి కాదు. శోభన్ బాబు వల్ల లాభపడిన వాళ్లు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా డబ్బు లేని వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ డబ్బు లేని వాళ్ళతోనే ఎక్కువగా సంబంధాలను కొనసాగించేవారు. అందుకే తన స్థాయికి తగ్గట్టుగా కోడళ్లను , అల్లుళ్లను తీసుకురావాలని ఎప్పుడూ ఆలోచించలేదు.

అందుకే కూతుర్లకు పెళ్లి చేసేటప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమ కూతుర్లకు భర్తలుగా వచ్చేవారు డబ్బు లేకపోయినా పర్లేదు, మంచి మనస్తత్వం బుద్ధిమంతులైతే చాలు అని ఆలోచించారట. అందుకే మిడిల్ క్లాస్ అబ్బాయిలతోనే తన కూతుర్లకి పెళ్లి చేశారు. ఇక శోభన్ బాబు ముగ్గురు కూతుర్లు కూడా తన తండ్రి నిర్ణయాన్ని ఎప్పుడూ కాదనలేదు. పెద్దగా ఆస్తులు లేకపోయినా సాదాసీదా వ్యక్తులను పెళ్లిళ్లు చేసుకొని వారు వెళ్ళిపోయారు. ఇక ఉన్న ఒక్క కొడుక్కి కూడా సాధారణ హెడ్ మాస్టర్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి నుంచి ఒక రూపాయి కూడా కట్నంగా తీసుకోలేదు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎవరికీ తెలియదనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version