సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ని స్వీకరించిన కేటీఆర్.. మూసీ ఒడ్డులో మూడేళ్లు ఉంటా : కేటీఆర్

-

హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీ నది గురించి ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం జోరుగా నడుస్తోంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ పై ప్రజేంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హరీశ్ రావు, ఈటల రాజేందర్, కేటీఆర్ ముగ్గురు మూసీ నది ఒడ్డున మూడు నెలలు నివసిస్తే.. మూసీ ప్రాజెక్ట్ జోలికి వెళ్లను.. మూసీని పునరుజ్జీవనం చేయను అన్నారు. వాళ్లు ఉంటే.. వాళ్లు నాపై ఏ ఆరోపణలు చేసినా నేను ఏమి అనను అని ఇందుకు దానం నాగేందర్ వారికి ముగ్గురికి మూడు ఇండ్లు కేటాయించాలని ఆదేశిస్తున్నానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ని స్వీకరించారు కేటీఆర్.తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నాగోల్ ఎస్టీపీ కేంద్రాన్ని పరిశీలించారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూసీలో మూడు నెలలు కాదు.. మూడేళ్లు అయినా మూసీ ఒడ్డులో ఉంటాను. మూసీ గురించి నాకు తెలుసు. గతంలో నేను నింబోలి అడ్డాలోనే ఉన్నానని గుర్తు చేశారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version