కాంగ్రెస్ హయాంలోనే మూసీ మురికి కుంపంగా మారింది : కేటీఆర్

-

కాంగ్రెస్ హయాంలోనే మూసీ మురికి కుంపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తాజాగా నాగోల్‌లోని సీవేజ్‌ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి మూసీ నది ఒక వరమని.. ఆ వరాన్ని మురికి కుంపంగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.

భారత్ లో ఎక్కడా లేని విధంగా ఎస్టీపీ ప్లాంట్ హైదరాబాద్ లో ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసిందన్నారు. ఎస్టీపీతో 20కోట్ల లీడర్ల నీరు శుద్ధి అవుతుందని తెలిపారు. హైదరాబాద్ కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన పనులకే కొత్తగా రిబ్బన్లు కట్టి హడావిడి చేస్తున్నారని విమర్శించారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితుల తరుపున న్యాయ పోరాటం చేయడానికైనా తాము సిద్దమని ప్రకటించారు కేటీఆర్. ఢిల్లీ పెద్దలకు నువ్వు డబ్బు పంపాలంటే.. మేము చందాలేసుకొసి ఇస్తాం.. కానీ మూసీ ప్రజలను ఇబ్బంది పెట్టకని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version