ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెట్టిస్తోన్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంతో ఎంత లాభముందో అంతకు రెట్టింపు ముప్పు ఉందని స్వయంగా దీని సృష్టికర్తలే చెబుతున్నారు. ఇప్పటికే దీనివల్ల జరిగే ముప్పు తాలూకూ పరిణామాలు మొదలయ్యాయి. అందులో డీప్ ఫేక్ చాలా డేంజర్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. డీక్ ఫేక్‌తో రాబోయే రోజుల్లో మరితం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోల వ్యాప్తితో పెను దుమారం రేగుతోంది. కేవలం మహిళలే కాకుండా అందరూ వీటి బారిన పడే అవకాశముందనే ఆందోళన మొదలవుతోంది. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ డీప్ ఫేక్ వల్ల రాజకీయ నేతలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. మరో ఐదు రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో డీప్ ఫేక్‌పై కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చని పార్టీ కార్యకర్తలను అప్రమత్త చేశారు. ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్ ఓటర్లను మభ్యపెట్టేందుకు డీప్‌ఫేక్‌తో దుష్ప్రచారం చేస్తుందని.. బీఆర్ఎస్ సైనికులు అప్రమత్తతో ఉండి ఓటర్లను చైతన్యపరచాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.