ప్రెస్‌క్లబ్‌లో చర్చ కోసం రేవంత్ రెడ్డికి కుర్చీ ఏర్పాటు చేశారు కేటీఆర్. ఇటీవల కాంగ్రెస్ సభలో రైతు సమస్యలపై చర్చకు ప్రధాని మోదీ, కేటీఆర్, కేసీఆర్, కిషన్ రెడ్డి ఎవరైనా సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. తాను సిద్దమే అని చెప్పారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలని కేటీఆర్ అన్నారు.

ఇప్పటికే కేటీఆర్ BRS నేతలతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. ఈ తరుణంలోనే ప్రెస్‌క్లబ్‌లో చర్చ కోసం రేవంత్ రెడ్డికి కుర్చీ ఏర్పాటు చేశారు కేటీఆర్. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.