గుజరాత్ లో పత్తికి రూ.8,257 ధర… మరి తెలంగాణలో రూ.5 వేలేనా ? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. బడా భాయ్ రాష్ట్రంలో పత్తి రైతుకు పట్టాభిషేకం. ఛోటా భాయ్ పాలనలో మాత్రం పత్తి రైతు చిత్తు అంటూ ఆగ్రహించారు. గుజరాత్ లో మద్దతు ధరకు మించి రూ.8,257 రేటు. మరి తెలంగాణలో పత్తి రైతుకు కేవలం రూ.5 వేలేనా ? అని ప్రశ్నించారు కేటీఆర్.
మార్కెట్ కు దిగుబడి వచ్చినా సీసీఐ కేంద్రాలెక్కడ ? ఇందిరమ్మ రాజ్యమని దళారుల రాజ్యం తెస్తారా ? అని నిలదీశారు. రెండేళ్ల క్రితం పత్తికి 10 నుంచి 15 వేల ధర. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏమిటీ అనర్థం ? అంటూ ఆగ్రహించారు. నిన్న పెట్టుబడి సాయం అందించలేదు.. నేడు కష్టించి పండించినా కొనుగోళ్లు చేయరా..? అంటూ ఆగ్రహించారు. పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం. ముందుచూపు లేని ముఖ్యమంత్రి వల్లే ఈ అన్యాయం అని ఫైర్ అయ్యారు.