BJP స్టీరింగ్‌ అదానీ చేతిలోకి వెళ్లిపోయింది-కేటీఆర్‌

-

నిన్న మహబూబ్‌ నగర్‌ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్‌ కు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు అని.. తెలంగాణ ప్రజలు కాదు..జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు అని పేర్కొన్నారు. BRS పార్టీ స్టీరింగ్ కేసీఆర్ గారి చేతిలోనే పదిలంగా ఉంది…కానీ బిజెపి స్టీరింగ్.. అదాని చేతిలోకి వెళ్లిపోయిందని చురకలు అంటించారు మంత్రి కేటీఆర్‌.

KTR counter to modi and bjp

మీరు కిసాన్ సమాన్ కింద ఇచ్చింది కేవలం నామమాత్రం…కానీఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం మీరు తెలుసుకుంటే మంచిదని మండిపడ్డారు. రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం… మిలియన్ డాలర్ జోక్ అంటూ విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్‌. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం తెలంగాణలోనే ఆవిష్కృతమైందన్నారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version