చాయ్ తాగుతూ.. రైతులతో ముచ్చటిస్తూ.. సిరిసిల్ల రైతు బజార్ లో కేటీఆర్ ప్రచారం

-

కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బీ. వినోద్‌ కుమార్‌కు మద్దతుగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని రైతుబజార్‌లో పర్యటించిన ఆయన రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. గులాబీ పార్టీకే ఓటేయాలని వారిని కోరారు. వారి కష్టసుఖాలను అడిగితెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఓ హోటల్‌లో స్థానికులతో కలిసి కేటీఆర్ చాయ్‌ తాగారు. ఓట్లు అడిగేందుకు రైతు బజారుకు వచ్చానని.. అయితే రైతులు.. కూర్చుని కూరగాయలు అమ్ముకునేలా షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారని తెలిపారు. 24 గంటల్లోపు వారికి తాత్కాలిక వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరోవైపు కేసీఆర్‌ ఉన్నప్పుడే బాగుందని, కేసీఆర్‌ ప్రభుత్వం పోయిన తర్వాత తమ వాగుల్లో నీళ్లు పోయాయని, ఓ నెల పింఛన్‌ కూడా రాలేదని ఆవేదన వ్యక్తంచేశారని తెలిపారు. మళ్లీ కేసీఆర్‌ వస్తేనే పేదలకు బాగుంటుందని అంతా అన్నారని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో వినోద్ కుమార్ తప్పకుండా గెలుస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version