తెలంగాణ భవన్ లో ఇవాళ కేటీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. సింగరేణి ప్రాంత ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో ఇవాళ కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. గనుల వేలం నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చ నిర్వహించానున్నారు.
ఈ మేరకు సింగరేణి ప్రాంత ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో ఇవాళ కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు సింగరేణి ప్రాంత ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో ఇవాళ కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు.
కాగా, అటు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రలోభాలకు పాల్పడుతూ.. ఒత్తిడికి గురిచేస్తూ.. లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని కేసీఆర్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్న కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చి లొంగదీసుకోవడానికి అన్ని రకాల కుట్రలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు.