రెచ్చగొట్టి..సాయి గణేష్‌ ను చంపేశారు – ఖమ్మం ఘటనపై కేటీఆర్ ఫైర్

-

రెచ్చగొట్టి..సాయి గణేష్‌ ను చంపేశారని.. ఖమ్మం ఘటనపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇవాళ మంత్రి కేటీఆర్‌ ఖమ్మం జిల్లాలోపర్యటించారు. నగరంలోని లకారం చెరువు పై ₹ 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్, ఎల్ఈడి లైటింగ్ ను మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ నామా నాగేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రెడ్లకు పగ్గాలు ఇస్తేనే మేము అధికారంలోకి వస్తాం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కుల పిచ్చి వాళ్ళు కావాలా? అన్ని కులాల వాళ్ళు కావాలనే కేసీఆర్ కావాలా? కులం ఒక్కటే ఓట్లు వేస్తే కుల సంఘానికి నాయకుడు అవుతాడని పేర్కొన్నారు.

విద్వంసం తప్ప మరే దానిమీద బీజేపీకి చిత్తశుద్ధి లేదు. ఎవరి దేవుడైనా దేవుడే. పర మతాన్ని గౌరవించడం నేర్చుకోవాలని నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. విద్యుత్, సాగునీటి సమస్య, త్రాగునీటి సమస్య పరిష్కారం అయ్యింది.. కేసీఆర్ అంటేనే కాలువలు, రేసేర్వేయర్లు, సాగునీరు అని అర్ధమన్నారు.
కేసీఆర్ లాంటి సి ఎం ఎక్కడన్నా ఉన్నారా అంటే ఎక్కడ లేరని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version