పల్నాడులో దారుణం…అన్నదమ్ములను హత్య చేయించిన చెల్లెమ్మ !

-

పల్నాడులో దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ములను హత్య చేయించింది చెల్లెమ్మ. ఆస్తి వివాదాల నేపథ్యంలో అన్నదమ్ముల దారుణంగా హత్య చేయించింది సోదరి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తండ్రి పోలురాజుకు పక్షవాతం రావడంతో మృతి చెందాడు. వచ్చే ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాల కోసం, అన్నని, తమ్ముణ్ణి హత్య చేపించిందని సోదరి కృష్ణవేణిపై ఆరోపణలు వస్తున్నాయి.

నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో టీచర్ గా పని చేసి పక్షవాతంతో మృతి చెందారు పోలురాజు. పోలురాజుకు ముగ్గురు సంతానం. గోపికృష్ణ,కృష్ణవేణి, రామకృష్ణ ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ఆర్థిక వ్యవహారాల్లో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో తన అన్న, తమ్ముడిని పక్కకు తప్పిస్తే వచ్చే డబ్బు, ఆస్తి మొత్తం తనకే చెందుతుందని ఆశపడిందట కృష్ణవేణి.

గోపికృష్ణ బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజుల నుండి విధులకు గైర్హాజరు అయ్యాడు. ఈ నేపథ్యంలో అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అన్న గోపికృష్ణను తమ్ముడు రామకృష్ణను కృష్ణవేణి హత్య చేయించిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలపై విచారణ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news