పంజాబ్ చెస్ ప్లేయ‌ర్ మ‌లికా హండాకు కేటీఆర్ సాయం

-

పంజాబ్ రాష్ట్రానికి చెందిన బ‌ధిర చెస్ ప్లేయ‌ర్ మ‌లికా హండాకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సాయం చేశారు. పుట్టుకతోనే మూగ, చెవిటి స‌మ‌స్య‌తో ఉన్నా.. త‌న ప్ర‌తిభ కు అవి అడ్డు కాద‌ని చెస్ లో అద్భుతంగా రాణిస్తుంది. అయితే ఇటీవ‌ల మ‌లికా హండాను కేటీఆర్ ఆదుకుంటాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. దీంతో ఈ రోజు మ‌లికా హండా తో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ను మంత్రి కేటీఆర్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మ‌లికా హండాకు మంత్రి కేటీఆర్ రూ. 15 ల‌క్షల సాయం చేశారు.

అంతే కాకుండా ఒక ల్యాప్ టాప్ ను కూడా మ‌లికా హండాకు మంత్రి కేటీఆర్ బ‌హుక‌రించారు. అలాగే ఎంతో ప్ర‌తిభ గ‌ల మ‌లికా హండాకు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కోరారు. కాగ మిలికా పుట్టుకతోనే మూగ, చెవిటి అయినా.. బ‌ధిర చెస్ తో ఎంతో ప్ర‌తిభ చూపింది. మలికా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ టోర్నీ, ఆసియా చాంపియ‌న్ షిప్ ల‌లో రెండు స్వ‌ర్ణాలు గెలిచింది. ‘

అలాగే జాతీయ బ‌ధిర చెస్ ఛాంపియ‌న్ షిప్ లో మ‌లికా ఏడు సార్లు స్వ‌ర్ణం ప‌తాకం గెలుచుకుంది. అయితే తాను ఇన్ని విజ‌యాలు సాధిస్తున్న త‌న‌ను ఎవ‌రూ పట్టించుకోవ‌డం లేద‌ని మ‌లికా హండా ఒక సారి ట్విట్ చేసింది. అయితే ఆ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ గ‌తంలో స్పందించి సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news