దేవుళ్లను కూడా మోసం చేసిన దుర్మార్గుడు – కేటీఆర్‌ ఫైర్‌

-

దేవుళ్లను కూడా మోసం చేసిన దుర్మార్గుడు అంటూ సీఎం రేవంత్‌ పై కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. చేవెళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డిసెంబర్ 9 నాడే మొదటి సంతకం రూ. 2 లక్షలు రుణం ఎత్తేస్తా సోనియా గాంధీ మీద ఒట్టేసి చెప్పాడని… సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చాడని ఆగ్రహించారు.

BRS Working President KTR wrote a letter to CM Revanth Reddy

కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశామని తెలిపారు. ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టాడు. 2 లక్షల రుణం మాఫీ కోసం రూ. 49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు చెప్పారన్నారు. దీంతో తప్పించుకునేందుకు చావు తెలివితేటలు స్టార్ట్ చేయటం మొదలు పెట్టాడని నిప్పులు చెరిగారు. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే రూ. 40 వేల కోట్లు కట్టేస్తా అని 9 వేల కోట్లు కట్ చేసి మీడియా ముందు మాట్లాడాడని ఆగ్రహించారు కేటీఆర్‌. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక ప్రజలు తనను నమ్మరని భావించి…ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్ట్ 15 కు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు….ఆగస్ట్ 15 పోయింది. రుణ మాఫీ కాలేదు. దేవుళ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version