నేడు ఓఆర్ఆర్‌పై ఇంటర్‌చేంజ్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్​లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఇంటర్‌చేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.ఆ ఇంటర్‌ చేంజ్ నిర్మాణంతో నార్సింగి, మంచిరేవుల, గండిపేట్ ప్రాంతాలకు  ప్రయాణికులతోపాటు లంగర్‌హౌస్, శంకర్‌పల్లి నుంచి వచ్చే ప్రయాణికులు ఓఆర్ఆర్ మీదుగా గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంతో సులువుకానుంది.

మరోవైపు హైదరాబాద్‌లో 100శాతం మురుగునీటిని శుద్ధిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మూడు ప్యాకేజీల్లో 3866 కోట్లు వెచ్చించి కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.66 కోట్లు ఖర్చు చేసి జలమండలి నిర్మించిన కోకాపేట మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. కోకాపేట ఎస్టీపీని.. 15 LMD సామర్థ్యం, ఆధునిక సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ పరిజ్ఞానంతో నిర్మించారు. ఆ పరిజ్ఞానంతో తక్కువ విస్తీర్ణంలో.. ఎక్కువ మురుగు నీటిని శుద్ధి చేయవచ్చని, విద్యుత్‌ వినియోగం తక్కువగా ఉంటుందని  అధికారులు వెల్లడించారు.ఆ STP వల్ల ఆర్ధిక జిల్లాతోపాటు విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఉన్న ప్రాంతాల నుంచి ఉత్పన్నమయ్యే మురుగు నీటిని శుద్ధి చేయవచ్చని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version