మమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు.. PTI ఇంటర్వ్యూలో కేటీఆర్‌

-

జాతీయ రాజకీయాల్లోనూ బీఆర్ఎస్ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నామని తెలిపారు. గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుపొందాలనే లక్ష్యంతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్నామని స్పష్టం చేశారు. బీజేపీ నేడు ఓ పెద్ద శక్తి కావొచ్చు.. కానీ తమను కూడా అంత సులువుగా తక్కువ అంచనా వేయొద్దని తేల్చి చెప్పారు. ప్రజల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని పీటీఐ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ చెప్పారు.

‘రోమ్‌ను ఒక రోజులో నిర్మించలేదు. బీజేపీ.. ఒకరిద్దరు ఎంపీలతో ప్రయాణాన్ని ప్రారంభించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు. వెయ్యి మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో 9 స్థానాలను కైవసం చేసుకున్నాం. ఇప్పుడు పార్టీ విస్తరణ ప్రణాళికను అమలు చేస్తున్నాం. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, మధ్యప్రదేశ్‌, ఒడిశాల్లో బీఆర్ఎస్ రెక్కలు విస్తరించనుంది’ అని కేటీఆర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version