రాబోయే 10 ఏళ్లలో మెట్రోను 415 కి.మీ. విస్తరించాలన్నదే మా ఎజెండా : కేటీఆర్

-

తెలంగాణను అభివృద్ధి పథంలో నడించిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లోనూ పట్టం కట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్​లో రెసిడెంట్ వెల్ఫేర్​ అసోసియేషన్ల ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలోనే నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో విద్యుత్‌, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదన్న మంత్రి.. ఆ సమయంలో తరచూ విద్యుత్‌ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని గుర్తు చేశారు.

“తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మిషన్‌ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశాం. హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీటిని అందించాలన్నదే మా స్వప్నం. పెట్టుబడులు తేవడం, మౌలిక వసతులు కల్పిస్తేనే విశ్వనగరం సాధ్యం. మెట్రో రైలు సేవలు 70 కిలోమీటర్లు పూర్తి చేస్తుకున్నాం. మెట్రోను రాబోయే 7-10 ఏళ్లలో 415 కిలోమీటర్లు విస్తరించాలన్నదే మా ఎజెండా. చెత్త సేకరణ మరింత సమర్థ నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. పురపాలనలో రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో పౌరుల భాగస్వామ్యం కల్పించే బాధ్యత నాది.” అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version