కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే ఉపఎన్నిక వస్తుంది : బండి సంజయ్

-

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ ఎవరు గెలిచినా మళ్లీ ఉపఎన్నికలు తథ్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఓడిపోయే చోట కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కేసీఆర్‌ సహకరిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

చొప్పదండి బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ గెలుపు కోసం ప్రతికార్యకర్త నడుం బిగించాలని ఆయన ప్రజలను కోరారు. బీసీని ముఖ్యమంత్రి చేయగలిగే పార్టీ బీజేపీ మాత్రమేనని పునరుద్ఘాటించారు. ఈసారి కేసీఆర్ పార్టీ బంగాళాఖాతంలో కలవటం ఖాయమని బండి సంజయ్ అన్నారు. ఈ రెండు పార్టీలు తెర వెనుక ఒకరికొకరు సాయం చేసుకుటున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​ ఎవరికి ఓటు వేసినా.. ఆ ఓటు వృథాయేనని పేర్కొన్నారు.

నామినేషన్ల పర్వం తర్వాత బండి సంజయ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోజుకో నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓవైపు కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. మరోవైపు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version