బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇవాళ అక్కడ నిర్వహించిన డీలిమిటేషన్ సదస్సులో పాల్గొన్నారు. దీనివల్ల దక్షిణాదికి జరగనున్న నష్టంపై ఆయన ప్రసంగించారు. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులను కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ నరసింహన్ దంపతులను కేటీఆర్ శాలువాతో సత్కరించారు. అనంతరం వారి యోగక్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకుని వారికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తరఫున ఓ జ్ఞాపికను అందించారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం మాజీ గవర్నర్ ను కేటీఆర్ కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ వీడియోలు, ఫొటోలు చూసేయండి.
మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేటీఆర్‌తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు pic.twitter.com/TBf4OHwjNm
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2025