చార్మినార్‌ను తొలగించడం అంటే హైదరాబాదీలను విమర్శించడమే : కేటీఆర్

-

తెలంగాణ అధికారిక చిహ్నంలో పలు రాచరిక గుర్తులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుర్తుల తొలగింపుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. ఇప్పటికే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల ప్రతిపాదన దృష్ట్యా బీఆర్ఎస్ నేతలతో కలిసి హైదరాబాద్ చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ప్రగతిని కనిపించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ పేరు కనిపించకుండా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే మార్పు చేస్తోందన్న కేటీఆర్.. చార్మినార్‌ను తొలగించడం అంటే హైదరాబాదీలను విమర్శించడమేనని అన్నారు. కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించడం అంటే మూర్ఖపు నిర్ణయమేనని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news