సీఎం కేసీఆర్ వందేళ్ల ముందుచూపుతో.. విశ్వనగరంగా హైదరాబాద్ : కేటీఆర్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో భాగ్యనగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. కేసీఆర్ వందేళ్ల ముందుచూపు.. విప్లవాత్మక నిర్ణయాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే.. తెలంగాణ సాధించకముందు.. స్వరాష్ట్రం సాధించిన తర్వాత అని చర్చించుకుంటున్నారని చెప్పారు.

హైదరాబాద్ రహదారి వ్యవస్థలో మార్పులు, మెట్రో రైలు, మౌళిక వసతులు, ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం, హరిత హారం.. ఇలా నగరంలో కేసీఆర్ సర్కార్ చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమై ఇవాళ ఈ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్‌ నగరం మునుపెన్నడూ చూడని అభివృద్ధి సాధించిందని ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పొట్టకూటి కోసం ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వారికి ఉపాధి లభించేలా నగర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. మరోవైపు.. హైదరాబాద్​లో శాంతిభద్రతలు బాగుంటేనే అందరం సుభిక్షంగా ఉంటామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news