ప్రభుత్వాలు, పాలకులు సరైన ప్రణాళికలతో ముందుకు వెళితే ఆయా నగరాలు అద్భుతంగా అభివృద్ది చెందుతాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో కృష్ణా, గోదావరి నుంచి వందల కిలో మీటర్ల నుంచి నీటిని తీసుకువచ్చి హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నామని తెలిపారు. హైటెక్స్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
రియల్ ఎస్టేట్ అంటే కేవలం అమ్మకం కొనుగోలు మాత్రమే కాదనీ.. ఈ రంగంపై రాష్ట్రంలో 30లక్షల మంది ఆధారపడి పనిచేస్తున్నారని తెలిపారు. వినూత్నమైన ఆకృతులతో అద్భుతమైన భవనాలను నిర్మాణం చేయాలని రియల్ ఎస్టేట్ సంస్థలను కోరారు. ప్రముఖ అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగిన రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా హైదరాబాద్ నగరాభివృద్దిని ప్రత్యేకంగా తమ నివేదికలో పేర్కొంటున్నాయని కేటీఆర్ తెలిపారు. నగరాభివృద్దిని టైలర్ మాత్రమేనని ఇంకా అనేకమైన ప్రాజెక్టులతో గొప్ప విజన్‌తో నగరాభివృద్ది సినిమా ముందుందని తెలిపారు. వినూత్నమైన ఆకృతులతో అద్భుతమైన భవనాలను నిర్మాణం చేయాలని రియల్ ఎస్టేట్ సంస్థలను కోరారు.