ఫార్ములా ఈ రేస్ రద్దుపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ దుర్మార్గమే అని మండిపడ్డారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమే అంటూ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో జరిగే ఇలాంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం దేశం యొక్క బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయన్నారు. కానీ కాంగ్రెస్ వల్లే…హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దు అయిందని ఆగ్రహించారు.
కాగా, హైదరాబాద్ లో ఫిబ్రవరి 10 న హుస్సేన్ సాగర తీరాన జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ జరుగాల్సి ఉండేది. కానీ హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దు చేస్తున్నట్లు తమ నిర్ణయం వెల్లడించింది FIA ఫార్ములా-e. తెలంగాణలో కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. రేస్ నిర్వహణపై గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంగణపై మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని స్పష్టం చేశాయి ఫార్ములా ఈ ఆపరేషన్స్. హైదరాబాద్ కి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో ఈ రేస్ జరుగనుంది.