సీఎం తీరు చూస్తే కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది: కేటీఆర్‌

-

సీఎం రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నారని అనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలూ కొట్టుకుపోవాలనేది సీఎం ఆలోచనలా ఉందన్న కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వమే కుట్ర చేస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టు కొట్టుకుపోయేలా చేసే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. క్షుద్ర రాజకీయాల కోసం మేడిగడ్డను బలి చేయవద్దని హితవు పలికారు.

“మాపై కక్షతో నీళ్లు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేయవద్దు. కాళేశ్వరంపై దుష్ప్రచారం మాని పరిష్కారం చూపాలి. వానాకాలం రాకముందే మేడిగడ్డపై మేల్కొండి. కేటీఆర్‌ కాళేశ్వరంపై కాలయాపన చేయకుండా పరిష్కారం చూపండి. కాఫర్‌ డ్యామ్‌ కట్టి మేడిగడ్డకు మరమ్మతులు చేయవచ్చు. కనీసం ఒక పంప్‌ అయినా నడిపించి రైతులకు నీళ్లు ఇవ్వాలి. కాళేశ్వరమంటే ఏంటో సజీవంగా చూపాట్టాలనుకున్నాం. కాళేశ్వరం వల్ల గోదావరిలో మన వాటా సాధించుకున్నాం. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మేడిగడ్డ వెళ్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతాం.” అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version