తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బిజెపిని విమర్శిస్తూ ట్విట్ చేశారు. 2014లో పాలమూరు “ప్రాజెక్టు ఆలసత్వం విషయంలో మోదీ యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిజెపి అధికారంలో ఉన్న పదేళ్లలో అదే వైఖరి కొనసాగించింది” అని దుయ్యబట్టారు.
పాలమూరు ప్రాజెక్టుకు బిజెపి ప్రభుత్వం ఇచ్చిన సహకారం జీరో అని… రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూడా కాషాయపార్టీకి అదే సంఖ్యను ఇస్తారన్నారు. కాగా, ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా మరికొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. మోడీ తెలంగాణకు ఇచ్చిన పది హామీలను నెరవేర్చలేదంటూ ఆయనను రావణాసురుడితో పోల్చారు. ITIR, టెక్స్టైల్ పార్క్, డిఫెన్స్ కారిడార్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మిషన్ భగీరథ ఫండ్స్, బయ్యారం స్టీల్ ప్లాంట్, పసుపు బోర్డు, మెడికల్ కాలేజీ, IIM ఏమయ్యాయని ఆ ఫ్లెక్సీలో ప్రశ్నించారు.