ktr on nirmala sitharaman: కేంద్ర బడ్జెట్ లో ఈ సారి గుండు సున్నానే అంటూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. మోదీ 3.0 సర్కారులో తొలి వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వరసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనత సాధించి హిస్టరీ రికార్డు చేయబోతున్నారు.
బీజేపీకి లోక్‌సభ స్థానాలు తగ్గడం, త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బడ్జెట్‌లో భారీగా జనాకర్షకాలు ఉండచ్చన్న అంచనాలున్నాయి. ఈ తరునంలోనే… కేంద్ర బడ్జెట్ పై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సారి కూడా రాష్ట్రానికి నిధుల కేటాయింపులు గుండు సున్నానే ఉండొచ్చు అన్నారు. నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా కేంద్ర బడ్జెట్‌లో పదేళ్లుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పందించారు కేటీఆర్.