మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో…కాంగ్రెస్ విగ్రహాలను తొలగిస్తామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది….దొడ్డి దారిన పిసిసి ప్రసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు అంటూ రేవంత్ పై ఫైర్ అయ్యారు.
నీ ఆలోచనల్లో కుసంస్కారం … నీ మాటలు అష్ట వికారం… తెలంగాణతల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రేస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అన్నారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటదని..చురకలు అంటించారు. మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు కేటీఆర్.