తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ ఆక్ట్ అమలుపైన కేటీఆర్ స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందించిన కేటీఆర్… పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామిక తెలంగాణలో.. మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయని… ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహించారు. హక్కులను అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు కేటీఆర్.
పోరాడితే సస్పెన్షన్లు చేస్తున్నారు… ఇది నియంతృత్వ రాజ్యమని ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం..నిర్బంధాన్ని నిర్మిస్తున్నదన్నారు కేటీఆర్. పోరాటం తెలంగాణకు కొత్తకాదని తెలిపారు కేటీఆర్. ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నదని తెలిపారు. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తామని… ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతామని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ ఆక్ట్ అమలుపైన సీఎం రేవంత్ రెడ్డి తగ్గాలని కోరారు కేటీఆర్. లేకపోతే.. దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు కేటీఆర్.