తెలంగాణకు అస్థిత్వమే కాదు.. ఆస్తులు కూడా సృష్టించాం..: కేటీఆర్‌

-

తెలంగాణ ఆకాశమంత ఎత్తులో అగ్ర రాష్ట్రంగా ఉందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు అస్థిత్వమే కాదు.. ఆస్తులు కూడా సృష్టించామని తెలిపారు. 60 ఏళ్లలో రూ.4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపారని ఆరోపించారు. తెలంగాణలో గత పదేళ్ల ఖర్చు రూ.13,72,930 కోట్లుగా ఉందని చెప్పారు.

“విద్యుత్‌ రంగంలో మేం పెట్టిన ఖర్చు రూ.1,37,517 కోట్లు. విద్యుత్‌ రంగంలో మేం సృష్టించిన ఆస్తుల విలువ రూ.6,87,585 కోట్లు. విద్యుత్‌ స్థాపిత సామర్థ్యాన్ని 7,778 మె.వా. నుంచి 19,464 మె.వా.కు పెంచాం. తలసరి విద్యుత్‌ వినియోగాన్ని 1,196 యూనిట్ల నుంచి 2,140 యూనిట్లకు పెంచాం. విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం వచ్చే ఏడాదికి 26 వేల మెగావాట్లకు పెరుగుతుంది. విద్యుత్‌ రంగంలో మా కృషి ఫలితాలను ఇప్పటి పాలకులు అనుభవించనున్నారు. సాగునీటి రంగంపై పెట్టిన ఖర్చు 1,76,000 కోట్లు. రాష్ట్రపతి ముర్ము సొంత ఊరికి మొన్నటి వరకు విద్యుత్ లేదు. కానీ, తెలంగాణలోని ఏ గూడేనికి కరెంట్ సమస్య లేదు.” అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news